ASAFJAHI-DYNASTY-IN-TELUGU-PART-1-అసఫ్ జాహి వంశం - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Monday, 8 November 2021

ASAFJAHI-DYNASTY-IN-TELUGU-PART-1-అసఫ్ జాహి వంశం

ASAFJAHI-DYNASTY
అసఫ్ జాహి వంశం (క్రీస్తుశకం 1724-1948)
PART-1

asafjahi dynasty asaf jahi dynasty asaf jahi dynasty of hyderabad asaf jahi dynasty palace founder of asaf jahi dynasty asaf jahi dynasty founder asaf jahi dynasty rulers asaf jahi dynasty bits in telugu asaf jahi dynasty is associated with who founded asaf jahi dynasty asaf jahi dynasty belonged to the region of who started the asaf jahi dynasty asaf jahi dynasty history pdf in english asaf jahi dynasty in telugu pdf who was the founder of asaf jahi dynasty asaf jahi dynasty map


స్థాపకుడు

నిజాం ఉల్ ముల్క్

రాజధాని

ఔరంగాబాద్, హైదరాబాద్

తెగ

 తురాని తెగకు చెందినవారు

గొప్పవాడు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

చివరివాడు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

 నిజాం ఉల్ ముల్క్ దక్కన్ లో ఔరంగాబాద్ రాజధానిగా 1724లో  స్వతంత్ర రాజ్యం ఏర్పరిచాడు. 

 

1.   నిజాం ఉల్ ముల్క్( 1724- 48)

 

asafjahi dynasty asaf jahi dynasty asaf jahi dynasty of hyderabad asaf jahi dynasty palace founder of asaf jahi dynasty asaf jahi dynasty founder asaf jahi dynasty rulers asaf jahi dynasty bits in telugu asaf jahi dynasty is associated with who founded asaf jahi dynasty asaf jahi dynasty belonged to the region of who started the asaf jahi dynasty asaf jahi dynasty history pdf in english asaf jahi dynasty in telugu pdf who was the founder of asaf jahi dynasty asaf jahi dynasty map

·       నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ ఖమృద్దిన్ ఖాన్, ఇతను అసఫ్ జాహి వంశస్థాపకుడు.

·       ఔరంగజేబు ఇతనికి నాలుగువేల సేనను ఇచ్చి మున్సబ్ దారునిగా నియమించి చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదునిచ్చాడు.

·       ఫారుక్ సియర్ ఇతనికి 7000 సేనను ఇచ్చి మన్సబ్ దారునిగా నియమించి నిజాం ఉల్ ముల్క్”, ఫతే జంగ్ అనే బిరుదులను ఇచ్చాడు

·        మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా 8000 సేనను ఇచ్చి అసఫ్ జా అనే బిరుదునిచ్చాడు.

·       ఇతను 1724లో శక్కర్ ఖేడా యుద్ధంలో ముబారక్ ఖాన్ ని ఓడించి అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించారు.

·        ఇతను మొదటగా ఔరంగాబాదును రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు.

·       1739లో జరిగిన కర్నాల్ యుద్ధంలో పర్షియా రాజు నాదిర్ష మొఘల్ సైన్యాన్ని ఓడించగా మొగలులకు నాడిర్ష కు మధ్య నిజాం శాంతి ఒప్పందం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

·        ఈ ఒప్పందం ప్రకారం నెమలి సింహాసనం మరియు కోహినూరు వజ్రంను నాడిర్షాకు ఇవ్వడం జరిగింది. 

2.   నాజర్ జంగ్

·       ఇతను మొగల్ చక్రవర్తితో నిజాం ఉదౌలా అనే బిరుదు పొందింది దక్కన్ సుబేదారు అయ్యాడు.

·       ఇతను నిజాం ఉల్ ముల్క్ రెండవ కుమారుడు , నిజాం ఉల్ ముల్క్ మరణానంతరం నాజర్ జెంగ్ తన   మేనల్లుడు అయిన ముజఫర్ జంగ్ తో వారసత్వ యుద్ధంలో గెలిచి రాజు అయ్యాడు.

 

3.   ముజఫర్ జంగ్

·       ఫ్రెంచ్ గవర్నర్ డుప్లే సహాయంతో ముజఫర్ జంగ్ నవాబ్ గా నియమించబడ్డాడు.

·       కడప నవాబు అయిన హిమ్మత్ ఖాన్ 1751లో ముజఫర్ జంగ్ ను చంపాడు.

 

4.   సలబత్ జంగ్ (1751-61)

·       బుస్సి అనే ఫ్రెంచ్ అధికారి నాజర్ జాంగ్ తమ్ముడైన సలబత్ జాంగ్ నీ హైదరాబాద్ నవాబ్ గా ప్రకటించాడు.

·        దాంతో ఈ నవాబు ఉత్తర సర్కారులను 1752లో ఫ్రెంచి వారికి బహుమతిగా ఇచ్చాడు తర్వాత తిరిగి వెనక్కి తీసుకున్నాడు.

·       1761 సలబత్ జంగ్ ను బంధించి తానే పరిపాలకుడు అని నిజాం అలీ ప్రకటించుకున్నాడు.

  

5.   నిజామ్ అలీఖాన్(1761 -1803)

·       నిజామ్ అలీ ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కి తన రాజధానిని తరలించారు.

·        ఇతన్ని రెండవ అసఫ్జా అంటారు, ఇతని కాలం నుండి  అసఫ్జాహీలు నిజములుగా పిలువబడ్డారు.

·        లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో చేరిన మొట్టమొదటి రాజు ఇతను.

·         జోగి పంతులు మధ్యవర్తిత్వంతో ఉత్తర సర్కారులు శ్రీకాకుళం, ఏలూరు, రాజమండ్రి, ముస్తఫా నగర్ 1766 బ్రిటిష్ వారి వశమయ్యాయి.

·       మూడో మైసూరు యుద్ధంలో పొందిన కడప, బళ్ళారి ప్రాంతాలతో పాటు అనంతపూర్ ప్రాంతాలను కూడా సైన్య సహకార పద్ధతిలో భాగంగా బ్రిటిష్ సైన్యానికి అయ్యే ఖర్చు కింద ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంతాలను దత్త మండలాలు అంటారు

·        ఫ్రెంన్చ్ అధికారి  రేమండ్ సహాయంతో ఇతను గన్ ఫౌండ్రీ ని ఏర్పాటు చేశాడు. నిజాం 1803లో రెసిడెన్సి భవనం నిర్మించాడు, దీని ఆర్కిటెక్ శాముల్

·       నిజామ్ అలీఖాన్ మోతీ మహల్, రోషన్ మహాల్, గుల్షన్ మహల్ లను కట్టించాడు.

 

6.   సికిందర్ జా (మూడో అసఫ్ జా) 1803-29

·       ఇతని పేరు మీదుగానే సికింద్రాబాద్ ఏర్పడింది.

·        హైదరాబాదులో బ్రిటిష్ ప్రెసిడెంట్ గా హెన్రీరస్సెల్ 1811లో వచ్చాడు.

·       సంస్థానంలో శాంతి భద్రతలు పెంపొందించడానికి రస్సెల్ దళం లేదా హైదరాబాద్ కంటింజెంట్ సైన్యాన్ని  ఏర్పరిచాడు, ఈ దళం హైదరాబాద్ సైన్యంగా పేరు పొందింది.

·        నిర్వహణ ఖర్చు పెరగడంతో  నిజాం పామర్ కంపెనీ నుండి 60 లక్షల అప్పు తీసుకున్నాడు.

 

7.   నసిరుద్దౌల(1829-1857) 4వ అసఫ్ జా

·       ఇతని కాలంలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి అవి

·        వహాబీ ఉద్యమం

o   ఈ ఉద్యమానికి హైదరాబాదులో  నాజర్ ఉద్దౌలా తమ్ముడు ముబారక్ ఉద్దౌల నాయకత్వం వహించాడు.

o    ఆంగ్లేయులు ఇతని అరెస్టు చేసి గోల్కొండ కోటలో బంధించగా 1854లో అక్కడే మరణించాడు.

o   ఈ ఉద్యమానికి కడప కర్నూలు నవాబుల నాయకుడు గులాం రసూల్ ఖాన్ మద్దతు పలికాడు. ఇతను  తిరుచునాపల్లి జైలుకు పంపబడ్డాడు.

 

·       బేరర్ ఒప్పందం

o   నిజాం  తన నుండి తీసుకున్న 60 లక్షలను 1850 డిసెంబర్ 31 లోపు చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం షరతు విధించింది.

o    1853లో గవర్నర్ జనరల్ మరియు నవాబు మధ్య  ఒప్పందం జరిగింది. తర్వాత రస్సెల్ సైన్యాన్ని హైదరాబాద్ కంటింజెన్సీ సైన్యంగా మార్చి బ్రిటిష్ ఇండియా సైన్యానికి అనుబంధంగా మార్చారు.

o    అంతేకాకుండా ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి బీరార్,రాయచూర్,ఉస్మానాబాద్ ప్రాంతాలను ఇచ్చాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రధాని సిరాజ్ వుల్ మల్క్ అనారోగ్యంతో  మరణించాడు.

o   ఈ సమయంలోనే  మీర్ తురాబ్ అలీ ఖాన్ (సాలార్జంగ్1) హైదరాబాద్ ప్రధాని అయ్యాడు.

o     ఈ నవాబు కాలంలోనే సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయింది.ఈ తిరుగుబాటు ప్రారంభం అయిన  వారం రోజుల తర్వాత నాసిర్ ఉద్దౌల మరణించాడు.

 

8.   అఫ్జల్ ఉద్దౌలా

·       అఫ్జల్ ఉద్దౌలా మరియు ఇతని ప్రధాని సాలార్జంగ్ 1857  సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు పలికారు.

·       తిరుగుబాటు తరువాత 1861లో బ్రిటిష్ వారు ఈ నవాబుకి స్టార్ ఆఫ్ ఇండియా అంటే విశ్వాసనీయ మిత్రుడు అనే బిరుదు నిచ్చారు.

  

9.   మీర్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911)

·       అఫ్జల్ ఉద్దౌలా మరణం తర్వాత అతని 2 సంవత్సరాల కుమారుడు అయినా మీర్మహబూబ్ అలీ ఖాన్ ని హైదరాబాద్ నవాబ్ గా ప్రకటించబడ్డాడు.

·        ఇతనికి సాలార్ జంగ్ నేతృత్వం వహించి సంరక్షకుడిగా ఉన్నారు.

·        మీర్మహబూబ్ అలీ ఖాన్ కి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 1884లో లార్డ్ రిప్పన్ స్వయంగా హైదరాబాద్ కి వచ్చి మహబూబ్ అలీ ఖాన్ కి అధికారాలు అప్పగించాడు. హైదరాబాద్ సంస్థానం సందర్శించిన మొట్ట మొదటి వైస్రాయి ఈయనే.

·       మీర్మహబూబ్ అలీ ఖాన్ 1893లో క్వనుంచా-ఈ-ముబారక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

·        ఇతను విద్యా రంగంలో అనేక కృషి చేశాడు ముస్లిం బాలికల కొరకు 1885లో సయ్యద్ బిల్ గ్రామీ చొరవతో ముస్లిం బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశాడు.

·        నాంపల్లిలో బాలికల పాఠశాలను

·        సరూర్ నగర్ లో బాలికల అనాధ ఆశ్రమం

·       వరంగల్ మరియు ఔరంగాబాద్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఇతనికి ప్రవేశపెట్టాడు.

·        ఇతని కాలంలోనే అసఫీయ లైబ్రరీ ఏర్పాటు చేశారు.

·       ఇతను పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను రాజభాషగా ప్రవేశపెట్టాడు.·       ఇతని ప్రధాని వికారుద్దీన్  ఫలక్ నామ ప్యాలెస్ కట్టించాడు.

·       1908 సెప్టెంబర్ లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతొ ఆనకట్టల నిర్మాణానికి ప్లాన్ వేయించాడు.

·       వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ రాజ్యాన్ని సందర్శించినప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ విక్టోరియా జననా హాస్పిటల్ ను కట్టించాడు.

·       1905లో తన 40వ జన్మదిన సందర్భంగా ఈ నవాబు పబ్లిక్ గార్డెన్ లో టౌన్ హాల్ నిర్మించాడు.

·       విక్టోరియా మహారాణి  ఈ నవాబుకి గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చిన సందర్భంలో అందుకని 1905లో మహబూబ్ అలీ ఖాన్ విక్టోరియా మెమోరియల్ అనాధ శరణాలయం సరూర్ నగర్ లో నిర్మించాడు.

 

10.     మీర్ఉస్మాన్ అలీ ఖాన్ (1911-1948)(7వ అసఫ్ జ)

·       ఇతని పూర్తి పేరు నవాబ్ మీర్ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్.

·         ఇతను పాలనా పరంగా అనేక సంస్కరణలు చేపట్టాడు.

·       హైదరాబాద్ సంస్థానంలో ఇతని పరిపాలన రూపం.

  

సంస్థానం

నిజామ్

సుబా

సుబేదారి

జిల్లా

కలెక్టర్

తాలూకా

 తాసిల్దార్

గ్రామం

పట్వారి,పటేల్,గ్రామ     సేవకులు


·      
 తన సంస్థానంలో శాసన వ్యవస్థ నుండి న్యాయవ్యవస్థను వేరు చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. 

·        దేశం మొత్తంలో మొట్టమొదట శాసన వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరుచేయబడిన సంస్థానం   హైదరాబాద్ .

·       ఏడవ నిజాం పరమత సహనం పాటించే వాడు దీనికి నిదర్శనంగా మాదన్నపేట,శంకర్ బాగ్, గౌలిపుర మొదలగు దేవాలయాలకు ప్రభుత్వ నిధులను పంపించేవాడు.

·       ఇతని కాలంలో లో మీర్లాయక్ అలీ అనే వ్యక్తి  యూ.న్.ఓ కీ పాకిస్తాన్ నుండి మొదటి ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఇతను పాకిస్తాన్నియుడు కాకున్నా పంపించారు.

 

ALSO READ:- ASAFJAHI  DYNASTY PART -2 

No comments:

Post a Comment